ఏపీ శాసనమండలిలో గందరగోళం.. లైవ్ కట్ చేశారని..

Update: 2020-01-22 05:58 GMT

ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. మండలిలో లైవ్‌ ప్రసారాలు నిలిపివేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరు సరికాదంటూ టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు సభను స్థంభింపచేశాయి. లైవ్‌ ప్రసారాలు ఇచ్చేంత వరకు సభను జరగనివ్వమంటూ పట్టుబట్టారు. మండ‌లి ప్రసారాలను టీవీల్లో లైవ్ రావాల‌ని టీడీపీ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సాంకేతిక‌మైన ఇబ్బందితో మండ‌లి ప్రసారాలు లైవ్ రావ‌డం లేద‌ని ప్రభుత్వం చెబుతున్నా లైవ్ ఇవ్వాల్సిందే అని టీడీపీ పట్టుబట్టింది.  

Tags:    

Similar News