శ్రీ తలుపులమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మలోవ దేవస్థానంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Update: 2019-12-23 07:32 GMT

తుని: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మలోవ దేవస్థానంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అమ్మవారికి జన్మనక్షత్ర పూజలు నిర్వహించి, పంచామృతాభిషేకం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది..వేద మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు 108 కళాశాలలో పంచామృతాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ముత్తయిదువులు కలశాలను శిరస్సున ధరించి అమ్మవారిని అభిషేకించారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకు నేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి నిర్వహించే జన్మనక్షత్ర పూజలను భక్తులు తిలకించి తరించారు.

Tags:    

Similar News