పెన్షన్ రాలేదని ఫిర్యాదు చేస్తే ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే

అర్హుడైన లబ్ధిదారునికి పెన్షన్ రాలేదని తనకు ఫిర్యాదు వచ్చినట్లయితే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్పష్టం చేశారు.

Update: 2020-02-01 14:26 GMT

అంబాజీపేట : అర్హుడైన లబ్ధిదారునికి పెన్షన్ రాలేదని తనకు ఫిర్యాదు వచ్చినట్లయితే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్పష్టం చేశారు. మండలంలోని పుల్లేటికుర్రులో శనివారం ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. ఎంపీడీవో వి.శాంతామణి అధ్యక్షతన జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పెన్షన్ దారు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని సూచించారు.

పంపిణీ లో ఎవరైనా నిర్లక్ష్యం వహించి నట్లయితే సంబంధిత అధికారులు,వాలంటీర్లు పై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ రాలేదని ఫిర్యాదు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరిక జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్య వచ్చినట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన వాలంటీర్లకు సూచించారు.

మండలంలో ఇప్పటివరకు 7,801పెన్షన్స్ ఇస్తున్నామని కొత్తగా 874 నమోదు అయ్యాయని వివరించారు. వీటిని పూర్తి పరిశీలన చేసి వీటికి కూడా పెన్షన్స్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో వైకాపా అధికార ప్రతినిధి పి.కె.రావు, మండల వైకాపా అధ్యక్ష కార్యదర్శులు వాసంశెట్టి చినబాబు, నాగవరపు నాగరాజు, వైకాపా నాయకులు అందే ముక్తేశ్వరరావు,కడలి భాస్కరరావు, నీతి పూడి మంగతాయారు, వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి ఎం. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News