ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత

Update: 2019-12-10 09:12 GMT

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కోటంరెడ్డికి హైబీపీ వచ్చింది. దాంతో ఆయనను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేయగా.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మంత్రులు ఆళ్లనాని, పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పరామర్శించారు.

కాగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంనుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కోటంరెడ్డి. మాజీ ఎంపీ వి . హనుమంతరావు ఆయన రాజకీయ గురువుగా చెప్పుకుంటారు. ఆ తరువాత వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా మారారు. ఆ విధేయతతోనే రెండు సార్లు టికెట్ సంపాదించారు. కాగా మొదటినుంచి దూకుడుగా వ్యవహరించే శ్రీధర్ రెడ్డి గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఓ మహిళా ప్రభుత్వం అధికారినిపై దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసు నమోదయింది.

Tags:    

Similar News