దేవినేని అవినాష్‌‌ వైసీపీలో చేరికపై కొడాలి నాని రియాక్షన్

Update: 2019-11-15 06:25 GMT

టీడీపీ యువనేత దేవినేని అవినాష్‌ నిన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అవినాష్ చేరికపై మంత్రి కొడాలి నాని స్పందించారు. దేవినేని అవినాష్‌ను వైసీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అవినాష్ ను గుడివాడలో పోటీ చేయించి.. రాజకీయ బలి పశువు చేశారని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్షతో... టీడీపీ ఎమ్మెల్యేలు విసుగు చెందారని అన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ వ్యవహార శైలి నచ్చకనే కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని విమర్శించారు. అతి త్వరలో టీడీపీకి ప్రతిపక్ష హోదాను కోల్పోనుందని జోశ్యం చెప్పారు. టీడీపీ హయాంలో ఇసుకను ఇష్టమొచ్చినట్టు దోచుకొని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తే లాభమేంటని ప్రశ్నించారు. అంతకముందు గుడివాడ మండలం మల్లాయిపాలెంలో ఇసుక స్టాక్ పాయింట్‌ను మంత్రి ప్రారంభించారు.

కాగా 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీచేసి.. వైసీపీ అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం కొడాలి నాని జగన్ కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖా మంత్రిగా కొనసాగుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా త్వరలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయన కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు.

Tags:    

Similar News