నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సచివాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ

Update: 2019-10-21 15:55 GMT

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సచివాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా కళాశాలలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. కోచింగ్‌లు పేరుతో పెడుతున్న బోర్డులను కళాశాల యాజమాన్యాలు వెంటనే తొలగించాలన్నారు. 699 కాలేజీల బోర్డులను తొలగించామని..1300 కాలేజీలకు 10 రోజులు డెడ్‌లైన్‌ విధించినట్టు మంత్రి స్పష్టం చేశారు.

ఇకనుంచి రాష్ట్రంలో అన్ని కళాశాలల బోర్డులు ఒకేవిధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రతి కాలేజీకి ఖచ్చితంగా ఆటస్థలాలు, ల్యాబ్‌లు ఉండాలని చెప్పిన మంత్రి.. ఈ సదుపాయాలు లేని కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలలకు ఫైర్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని.. ఒకవేళ ఇప్పటివరకు లేకపోతే ఇకనైనా తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News