జమ్మలమడుగులో వైద్య శిబిరం

మారిన ఆహార పదార్థాల వల్ల కొవ్వు పదార్థాలు తినడం వల్ల మనుషులకు గుండెపోటు ఎక్కువగా వస్తుందని గుండె శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ మహమ్మదాలీ పేర్కొన్నారు.

Update: 2019-12-26 10:05 GMT

జమ్మలమడుగు: మారిన ఆహార పదార్థాల వల్ల కొవ్వు పదార్థాలు తినడం వల్ల మనుషులకు గుండెపోటు ఎక్కువగా వస్తుందని గుండె శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ మహమ్మదాలీ పేర్కొన్నారు. పట్టణంలోని బోని రమేష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ, చాలామంది ఫ్యాషన్ గా పొగ తాగుతున్నారని దీనివల్ల తాగే వారికి కాకుండా చుట్టుపక్కల వారికి కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. సేవా దృక్పథంతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Tags:    

Similar News