Jaggampeta: ఉచిత కంటి వైద్య శిబిరం

కేరింగ్ హార్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ పాస్టర్ డీడీఆర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

Update: 2020-02-06 13:37 GMT

జగ్గంపేట: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కమ్మ వీధిలో ఉన్న యేసు క్రీస్తు ప్రార్థన మందిరంలో కేరింగ్ హార్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ పాస్టర్ డీడీఆర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ వైసీపీ నాయకురాలు గుణ్ణం సుబ్బలక్ష్మి , టీడీపీ నాయకుల కంటే రామారావు (బుల్లిఅబ్బు) ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో నిడదవోలుకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్లు సీహెచ్ నాగరాజు, సీహెచ్ శ్రావణి సుమారు 200 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.


Tags:    

Similar News