Andhra Pradesh: ఈ నెల 17న హై పవర్‌ కమిటీ తుది నివేదిక

హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా అభివృద్ధిపై చర్చించింది.

Update: 2020-01-13 07:41 GMT

హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా అభివృద్ధిపై చర్చించింది. అలాగే రాజధాని రైతులకు ఎటువంటి న్యాయం చెయ్యాలనేదానిపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపు అనివార్యం అయితే ఉద్యోగుల తరలింపు ఎలా అనే అంశాన్నీ కూడా పరిశీలించారు. ఈ నెల 17న తుది హైపవర్‌ కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రైతులు తమ సూచనలను 17 సాయంత్రం లోపు సీఆర్‌డీఏకు పంపించాలని పేర్నినాని చెప్పారు. ఇక రాజకీయల లబ్ది కోసమే అమరావతిలో ఆందోళనలకు పురిగొల్పుతున్నారని అయన అన్నారు. రాజధాని విషయంలో ఏమి జరగబోతుందో అందరికి క్లారిటీ ఉందని అన్నారు.

అమరావతి రైతులకు తాము చెప్పాలనుకున్నది అర్థమైందని అన్నారు. రాజకీయంగా సానుభూతిని పొందేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే వారే ఇలా చేస్తున్నారని చంద్రబాబు ను ఉద్దేశించి అన్నారు. తమ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్న వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అమరావతిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. అలాగే అమరావతిని తరలిస్తే నష్టపోతామనే భయం నిజమైన రైతుల్లో ఉందని వెల్లడించారు కన్నబాబు.  


Tags:    

Similar News