త్వరలో కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం

Update: 2019-11-08 10:34 GMT

కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఎన్‌ఎమ్‌డీసీ నుంచి ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు త్వరలో ఎన్‌ఎమ్‌డీసీ, ఏపీ ప్రభుత్వం మద్య ఒప్పందం జరగనుంది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చమురు కంపెనీ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించిన తరువాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీలో సిఎస్‌ఆర్ నిధులను రాష్ట్రంలో వనరుల ఆదాయాల పరంగా చమురు కంపెనీలకు చెల్లించాలని నిర్ణయించారు.

కాకినాడలో పెట్రోలియం సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. తూర్పు గోదావరిలోని ముమ్మిడివరం ప్రాంతంలో మత్య్సకారులకు చెల్లించాల్సిన రూ. 81 కోట్లను త్వరలో చెల్లిస్తామని ఈ సందర్భంగా ఓఎన్‌జీసీ అంగీకరించింది. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కుపై పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడి రూ .2 లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా. అంతకుముందు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గవర్నర్ బిస్వాభూషణ్ హరిచందన్ తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

Tags:    

Similar News