వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్‌

ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి సమయంలో కొంత డబ్బును ఇచ్చే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

Update: 2019-12-02 07:25 GMT
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి సమయంలో కొంత డబ్బును ఇచ్చే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.గుంటూరు జనరల్ ఆస్పత్రికి చేరుకున్న సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతులు మీదుగా చెక్కులు అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో సీఎం జగన్‌ మాట్లాడారు.

కాగా ఈ పథకంలో భాగంగా శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి సమయానికి రోజుకు 225 లేదంటే లేదా నెలకు గరిష్టంగా 5వేల రుపాయలు ఇస్తారు. ఒక వ్యక్తి జబ్బున పడితే ఆ వ్యక్తి మూలాన ఆర్ధిక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం వలన ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఆరోగ్యశాఖా అంచనా వేసింది. ఈ పథకం నిన్నటినుంచే అమల్లోకి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి అధికారికంగా నేడు ప్రారంభించడం విశేషం.



Tags:    

Similar News