విశాఖపట్నంలో సీఎం జగన్ ఇల్లు: భవనాల అన్వేషణలో వైయస్ఆర్సిపి నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది.

Update: 2020-01-07 07:54 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయ నిర్మాణానికి సరైన స్థలాన్ని గుర్తించడానికి వైఎస్సార్సీపీ నాయకులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి బజ్డెట్టును కూడా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలుస్తోంది.

ఈ నేపథ‌్యంలోనే సీఎం జగన్ విశాకపట్నంలో నివసించడానికి గాను ఆ పార్టీ నాయకుల, అధికారులు ఇంటిని వెతికే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ముఖ్యంగా సీఎం జగన్ కు గట్టి భద్రత కల్పించే ప్రదేశాలలో చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బీచ్ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ ను ప్రారంభ దశలోనే అద్దెకు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే హోటల్ నిర్మాణం పూర్తవుతున్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్ శాశ్వతంగా విశాఖపట్నంలో నివసించడానికి ఇంటి నిర్మాణం కోసం ఆ పార్టీ శ్రేణులు స్థలాలను వెతికే పనిలో పడట్టు కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే రుషికొండ, మధురవాడ, భీమిలి, కపులుప్పడ, తిమ్మపురం ప్రాంతాలలో స్థలాల కోసం వెతుకుతున్నారు. ఈ ప్రాంతంలో అనువైన స్థలాలను కనుగోలు చేసి ఇంటి నిర్మించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇక పోతే విశాఖపట్నం-భీమిలి మార్గంలో ఉన్న కొన్ని భవనాలను నిర్మాణాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఏదేమైనా విశాఖపట్నం నగర శివారులోని ఒక కొండపై అధికారిక నివాసం నిర్మించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ఈ ప్రదేశాల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు భద్రత తగినంతగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే జగన్ కు బెంగళూరు, హైదరాబాద్, తడేపల్లిలో ఇళ్ళు ఉన్నాయని ఇప్పుడు ఆయన విశాఖపట్నంలో కూడా ఇంటిని నిర్మించే అవకాశం ఉంది తెలుస్తోంది.


Tags:    

Similar News