Tirumala Brahmothsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం

Tirumala Brahmothsavalu: సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేక సేవ

Update: 2023-09-26 05:16 GMT
Chakra Snanam Tirumala Brahmothsavalu

Tirumala Brahmothsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం

  • whatsapp icon

Tirumala Brahmothsavalu: కలియుగ నాథుడి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఎనిమిది రోజుల పాటు.. తనకిష్టమైన వాహన సేవల్లో వివహరించి అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజైన ఇవాళ ఉదయం చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చక్రస్నాన మహోత్సవంలో భాగంగా ఈ ఉదయం వరాహస్వామి ఆలయ ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేకసేవ నిర్వహించారు.

చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలూ నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అలా ఈ రోజు జరిగిన చక్రస్నాన మహోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు హాజరై పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక ఈ సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెప్పడంతో బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.

Tags:    

Similar News