CBI Raid: రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు

Update: 2019-12-31 04:35 GMT

మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ దాడులు జరిగాయి. మంగళవారం ఉదయం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివిధ బ్యాంకులనుంచి రాయపాటి 300 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. వాటిని ఇప్పటి వ‌ర‌కు చెల్లించ లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, గుంటూరు, బెంగుళూరులో రాయపాటికి చెందిన నివాసాల్లో ఏకకాలంలోనే అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలోనూ సీబీఐ అధికారులు సోధాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది.


Tags:    

Similar News