120 అడుగుల లోతులో బోటు : ధర్మాడీ సత్యం

దేవిపట్నం మండలం కచ్చులూరు గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీసేందుకు బాలాజీ మెరైన్ కంపెనీ ధర్మాడి

Update: 2019-10-17 07:05 GMT

దేవిపట్నం మండలం కచ్చులూరు గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీసేందుకు బాలాజీ మెరైన్ కంపెనీ ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.120 అడుగుల లోతులో బోటును గుర్తించినట్లు ధర్మాడీ సత్యం తెలిపారు. బోటుని బయటకు తీసేందుకు భారీ లంగరు, 3 వేల అడుగుల ఐరన్‌ రోప్‌ని వాడుతున్నారు. బుధవారం బోటు మునిగిన ప్రాంతంలో వేసిన ఐరన్‌ రోప్‌కు బలమైన వస్తువు తగలడంతో..

దానిని సత్యం బృందం బోటుగా భావించింది. ఈ క్రమంలో భారీ నైలాన్‌ తాడుతో పొక్లెయిన్‌ ఉపయోగించి బలంగా లాగడంతో లంగరు ఒక్కసారిగా జారిపోయింది. అయితే ఆ సమయంలో బోటుకు సంబంధించిన తెల్లని రంగు నీళ్లపై కి తేలిందని సత్యం బృందం గుర్తించింది. దాంతో బోటు అదే ప్రాంతంలో ఉన్నట్టువారు నిర్ధారించుకున్నారు.  

Tags:    

Similar News