డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ప్రయోజనం

డ్వాక్రా మహిళలకు వైయస్సార్ ఆసరా పథకం కింద జిల్లాలో సుమారు వెయ్యి కోట్ల ప్రయోజనం చేకూరనుంది.

Update: 2019-12-10 07:42 GMT
వైయస్సార్ కాంగ్రెస్

కడప: డ్వాక్రా మహిళలకు వైయస్సార్ ఆసరా పథకం కింద జిల్లాలో సుమారు వెయ్యి కోట్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి బకాయిలు లేని సంఘాలకు సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సక్రమంగా రుణాల చెల్లింపు జరిగేందుకు ప్రోత్సాహంగా ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టింది. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగు విడతల్లో పొదుపు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.

అందులో భాగంగా జిల్లాల్లో అర్హులైన పొదుపు మహిళల జాబితాను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లా వ్యాప్తంగా 29,626 సంఘాలకు 990 కోట్ల రుణమాఫీ వర్తించనుంది. నాలుగు విడతల్లో నగదును బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. ఇప్పటికే సర్వే చేసి జాబితా రూపొందించి ప్రభుత్వానికి పంపారు. 2020 జనవరిలో మొదటి విడత మాఫీ నిధులు విడుదల చేయనున్నారు. దీంతో దాదాపు 3 లక్షల మంది సభ్యులు ప్రయోజనం పొందనున్నారు. ఎంపికైన ఒక సంఘానికి కనిష్టంగా లక్ష, గరిష్టంగా 5లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. ఆసరా పథకం ద్వారా రుణమాఫీ కానుండడంతో డ్వాక్రా మహిళలల్లో ఆనందం నెలకొంది. 


Tags:    

Similar News