Nellore: కరోనా వైరస్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

Update: 2020-02-13 14:07 GMT

నెల్లూరు: నవాబు పేట, చినబాలయ్య నగర్ లోని మున్సిపల్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ప్రపంచ దేశాలలో చర్చనీయాంశంగా ఉన్న కరోనా వైరస్ ను గురించి గురువారం సాయంత్రం విధ్యార్థులలో అపోహలను తొలగించి, అవగాహన గలిగించుటకు జనవిజ్ఞాన వేదిక నగర కమిటి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైధ్యశాల సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ మాట్లాడుతూ...కొన్ని మీడియాలలో వస్తున్న తప్పుడు ప్రకటనలను, వదంతులను, నమ్మవద్దని తెలియజేసారు.

కరోనా వైరస్ కు ఇంతవరకు ఎలాంటి మందులు కనుగొనబడలేదని అన్నారు. ఐనా సరే వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్ సోకకుండా నివారించవచ్చని.. గర్భిణులు, వృద్దులు, చిన్న పిల్లలు, గతంలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్ధుల అనేక సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ కరోనా విష వైరస్ కంటే ప్రజల ఆలోచనలనలలో అనుమానాలను, భయాలను కలుగజేయటం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రమతి జాస్మినమ్మ, జెవివి నగర అధ్యక్షులు ఎ. విజయ కుమార్, నాయకులు సుందర రాజ, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Tags:    

Similar News