EAMCET 2020: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, లాసెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల

Update: 2019-12-30 08:41 GMT

ఏపీ సెట్స్‌ షెడ్యూల్‌‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. ఎనిమిది సెట్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు. ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9న నిర్వహించనున్నారు. ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్‌ వెల్లడించారు.

Tags:    

Similar News