వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Update: 2019-12-21 08:14 GMT
జగన్‌

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో ధర్మవరంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించి వైఎస్సార్ చేనేత భరోసా చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ఒక్కో చేనేత కుటుంబానికి ఏటా 24 వేల ఆర్థికసాయం అందనుంది. చేనేత కార్మికుల కష్టాలు తనకు తెలుసని చేనేత కార్మికుల కన్నీళ్లు తుడవాలన్నదే తన లక్ష్యమన్నారు. అవినీతికి తావు లేకుండా పాలన సాగుతోందన్న జగన్‌ కులం, మతంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

Tags:    

Similar News