రైతులకు జగన్ సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. మూడో విడత రైతు భరోసా 2000 రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2020-01-02 04:50 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. మూడో విడత రైతు భరోసా 2000 రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గతేడాది రైతు భరోసా - పిఎం కిసాన్ పథకంలో భాగంగా చెల్లించాల్సిన మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు చెల్లించినట్టవుతుంది. దాదాపు 46,50,629 ఖాతాలకు మొత్తం 1,082 కోట్ల రూపాయలను నేరుగా రైతు చెల్లింపుల ఖాతాకు బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. సాధారణ రైతులు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ల ఖాతాల్లో డబ్బు జమ చేస్తారు.

ఈ పథకం కింద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ .13,500 ఇవ్వనున్నట్లు వాగ్దానం చేసింది. ఈ మొత్తాన్ని పంటల సాగు కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించి ఇప్పటికే అక్టోబర్‌లో ఒక్కో రైతుకు రూ .11,500 జమ చేసింది. మరోవైపు శుక్రవారం నుంచి లబ్ధిదారుల పేర్లను గ్రామ సెక్రటేరియట్ లలో ప్రదర్శిస్తారు. కాగా ఇప్పటికే లబ్ధిదారులు 46 లక్షలకు చేరుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.  

Tags:    

Similar News