ఏపీలో పాలనా వికేంద్రీకరణ జరిగితేనే బెటర్: సుందర రామశర్మ

ఏపీలో పాలనా వికేంద్రీకరణ తోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఏపీ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మ అభిప్రాయపడ్డారు.

Update: 2020-01-04 05:57 GMT
సుందర రామశర్మ

ఏపీలో పాలనా వికేంద్రీకరణ తోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఏపీ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మ అభిప్రాయపడ్డారు. పాలనను ఒకేచోట కేంద్రీకరించడం వలన అభివృద్ధి అక్కడే జరుగుతుందని.. ఇది ప్రాంతీయ విద్వేషాలకు దారితీస్తుందని చెప్పారు. రాజధానిని పెట్టేముందు కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రాంతంలో పర్యటించిందని.. ఆరోజు మూడు పంటలు పండే భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవద్దని చెప్పిందని గుర్తుచేశారు.

సారవంతమైన వ్యవసాయ భూములను చెరిపేసి రాజధాని కట్టడంలో అర్ధం లేదని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో మహానగరం సృష్టించి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం తగదని.. అలా అయితే దేశం మొత్తం ఒకే రాష్ట్రంగా పెట్టి అభివృద్ధి చేసుకోవచ్చు.. కానీ అది సాధ్యపడని కారణంగానే మనకు రాష్ట్రాలు, రాజధానులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు.

అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకుంది.. ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటుతో ఆ భూమినంత ఏమి చేస్తారో ప్రభుత్వం చెప్పాలని.. అలాగే ఏమి చేస్తే బాగుంటుందో ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. పాలనా సౌలభ్యం, అభివృద్ధి చెందడం కోసం రాష్ట్రాలను విభజిస్తారని.. ఇప్పుడు కూడా ఏపీలో అదే జరుగుతున్నట్టు అనిపిస్తోందన్నారు. అమరావతిలో ఎంతో నమ్మకంగా రైతులు నమ్మి వారికున్న ఎకరమో , అరఎకరమో ప్రభుత్వానికి ఇచ్చారు.. కానీ చంద్రబాబు వారిని నట్టేటా ముంచారని అభిప్రాయపడ్డారు శర్మ. 

Tags:    

Similar News