కన్నులపండువగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం.. కన్నులపండువగా జరిగింది.

Update: 2020-02-05 03:24 GMT

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం.. కన్నులపండువగా జరిగింది. వేదమంత్రోశ్చరణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య.. స్వామి వారి కళ్యాణం.. వైభవంగా నిర్వహించారు. వైఖానస ఆగమనానుసారం.. మృగశిర నక్షత్ర యుక్త తులా లగ్నం శుభఘడియల్లో.. వివాహ ఘట్టం ఘనంగా నిర్వహించారు.

వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. దివ్య ముహూర్త సమయమైన అర్ధరాత్రి 12 గంటలా 32 నిమిషాలకు దేవతామూర్తుల శిరస్సుపై జీలకర్ర బెల్లం పెట్టారు. మంగళ సూత్రధారణను పండితులు రమణీయంగా నిర్వహించారు. తలంబ్రాల ఘట్టాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు.


Tags:    

Similar News