Andhra Pradesh: శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నం: హోంమంత్రి సుచరిత

అధికారాన్ని కోల్పోయిన తరువాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సామాజిక వ్యతిరేక అంశంగా మారుతున్నారని ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు.

Update: 2020-01-09 04:42 GMT

అధికారాన్ని కోల్పోయిన తరువాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సామాజిక వ్యతిరేక అంశంగా మారుతున్నారని ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని అస్తవ్యస్త పరిస్థితులకు చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారని సుచరిత అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడం ద్వారా అమరావతి ప్రాంతంలో తన బినామీ భూములను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ప్రజల కోరిక మేరకు మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిందని.. అయినా అమరావతిలో శాసన రాజధానిని ఉంచే ప్రతిపాదన ఉందని ఆమె స్పష్టం చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణ లేకపోతే రాష్ట్రంలో అశాంతి ఉంటుందని శ్రీ కృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు స్పష్టం చేసిన విషయాన్నీ ప్రస్తావించనిన మంత్రి.. ప్రస్తుత తమ ప్రభుత్వం పాలన మరియు అభివృద్ధి యొక్క వికేంద్రీకరణను ప్రతిపాదించడం జరిగిందని.. దాంతో రాష్ట్రానికి చంద్రబాబు చేసిన నష్టాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు. అంతేకాకుండా, అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయటానికి ప్రభుత్వం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. బెంజ్ సర్కిల్ లో చంద్రబాబు అరెస్టుపైనా ఆమె స్పందించారు.

రాజధాని ప్రాంతంలో అశాంతిని సృష్టించి.. తన అనుచరుల భూములను కాపాడాలని ప్రయత్నిస్తున్నారని.. అందువల్లే ఆయన చౌక రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద తన మద్దతుదారులందరితో ధర్నా చేసి శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆమె అన్నారు. విజయవాడలో సమస్యలను సృష్టించడం ద్వారా ఈ ప్రాంతంలో గూండా గిరిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని ఆమె ఆరోపించారు.

ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని కూడా ఆమె ప్రస్తావించారు. కావాలనే పథకం ప్రకారమే ఎమ్మెల్యేపై దాడి చేయించారని.. ఘటనకు కారణమైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోమ్ మంత్రి స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం విప్, మాచెర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై ఆందోళనకారులు రాళ్ళూ రువ్విన సంగతి తెలిసిందే. దీనిపై ఇద్దరు వ్యక్తులను కూడా ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News