Jaladanki: ఇంటి వద్దకే వైయస్సార్ పింఛన్

పట్టణంలో ఇంటి వద్దకే పింఛన్లు వాలంటరీలతో పింఛన్ల పంపణీ కార్యక్రమాని నిర్వహించారు.

Update: 2020-02-01 08:00 GMT

జలదంకి: పట్టణంలో ఇంటి వద్దకే పింఛన్లు వాలంటరీలతో పింఛన్ల పంపణీ కార్యక్రమాని నిర్వహించారు. వైయస్సార్ మండల నాయకులు మాట్లాడుతూ...పింఛన్ దారుల కష్టాలు గట్టెక్కాయిని, పింఛను కోసం గంటల తరబడి కేంద్రాల వద్ద వేచి చూసే బాధలు అవ్వా, తాతలకు తీరిపోయాయి.

ఇకపై ఇంటి వద్దకే నేరుగా పింఛన్ చేరిపోతుందిని, పింఛను దారులకు పడిగాపులు తప్పిపోయాయని, గతంలో ఐదు గంటలకు నిద్రలేచి పింఛన్ పుస్తకాన్ని లైన్లో పెట్టేందుకు వెళ్లే తిప్పలు పడేవారని ఇప్పుడు ఆ తిప్పలు తొలగిపోయాయి. అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారు, వృద్ధాప్యంతో ఉండి కొద్ది దూరం కూడా నడవలేని వారు గతంలో రెండు నెలలకోసారి పింఛన్ తీసుకునేవారని ఈ రోజు నుండి ఇంటి వద్దకే వాలంటరీలు వెళ్లి నేరుగా పింఛన్ అందజేస్తున్నారని వారు అన్నారు. 

Tags:    

Similar News