గండికోట దిగువన మరో ప్రాజెక్టు.. ఫిబ్రవరిలో శంకుస్థాపన

Update: 2020-01-02 02:36 GMT

కడప జిల్లాలో కరువు పీడిత మండలాలు అయిన జమ్మలమడుగు, పులివెందుల, ముద్దనూరు, వేంపల్లె, వేముల మండలాలకు వ్యవసాయ కార్యకలాపాలకు సాగునీరు, తాగునీరు అందించడంలో భాగంగా. గండికోట రిజర్వాయర్ దిగువ ప్రవాహంలో 20 టిఎంసిఎఫ్ సామర్థ్యం గల మరో ఆనకట్టను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఆనకట్ట పనులు త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని సమాచారం. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి 25 వరకు జరిగిన తన పర్యటనలో ఈ ప్రాజెక్టు డీపీఆర్ ను పరిశీలించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. అంతేకాదు రాయచోటిలో జరిగిన బహిరంగ సభలో కూడా ఈ ప్రాజెక్టు యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. 2020 ఫిబ్రవరి నెలలో ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలనీ ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందువలన ప్రాజెక్టు అంచనాలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముద్దనూరు మండలంలోని ఆదివేటిపల్లి, తెనేటి పల్లి గ్రామాలలో ఆనకట్టను నిర్మించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇందుకోసం భూములను కూడా తీసుకునే పనిలో జిల్లా యంత్రాంగం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు, ఆనకట్ట నిర్మాణం మొదలైన వివిధ పనుల కోసం మొత్తం 1500 నుంచి 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని అంచనా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సిబిఆర్), మరియు పులివెందుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పిబిఆర్) మరియు కొన్ని కాలువల ద్వారా సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 200 గ్రామాలకు త్రాగునీటి అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. శ్రీశైలం ఆనకట్ట నుండి పోతిరెడ్డి పాడు రిజర్వాయర్ ద్వారా కృష్ణ వరదనీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి గండికోటకు పంపిస్తారు.. ఈ క్రమంలో ముద్దనూరు మండలంలోని ఆదివేటిపల్లి, తెనేటి పల్లి వద్ద ఆనకట్టను నిర్మిస్తారు.

Tags:    

Similar News