ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.

Update: 2019-12-27 05:55 GMT
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్బంగా అమరావతిలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మూడు రాజధానుల అంశంపైనే చర్చిస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై సమగ్రంగా చర్చ జరుగుతోంది. అలాగే అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా మధ్యాహ్నం తరువాత చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలపైనా కేబినెట్‌లో చర్చ జరగనుంది.

ఇటు రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాన్ని సేకరణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కొత్తగా 104, 108 వాహనాల కొనుగోలు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి సవరణలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎకనామిక్‌ జోన్ల ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.


Tags:    

Similar News