ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విశాఖ నుంచి పాలన..?

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు రావొచ్చు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ‌్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినసంగతి తెలిసిందే

Update: 2020-01-06 15:08 GMT

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు రావొచ్చు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ‌్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినసంగతి తెలిసిందే. దీనిపై జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్‌ కమిటీ నివేదికలు పలు కీలక అంశాలను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుత రాజధాని అమరాతిలోని పలు గ్రామాల ప్రజలు నిరసన తెలుపుతున్న విషయం విధితమే.

అయితే ఏపీ ప్రభుత్వం రాజకీయంగా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. అమరావతి నుంచి ముందుగా కీలక శాఖలను తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో నూతన సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 18న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం.

రాజధాని తరలింపు ప్రక్రియకు మంత్రివర్గ సమావేశంలో అమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచే పరిపాలన రాజధాని విశాఖపట్నంలో మిలీనియం టవర్స్‌లో నూతన సచివాలయానికి పలు శాఖలు తరలింపుకు ప్రక్రియ మొదలు పెట్టినట్లుంది. అయితే అన్ని శాఖలను ఒక్కసారే కాకుండా విడతల వారీగా సచివాలయం తరలించాలని భావిస్తుంది. ప్రభుత్వం ప్రాధాన్యత శాఖల్లో కొన్ని ముఖ్యమైన విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించాలని నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

కాగా..ప్రభుత్వం జీఏడీ, ఫెనాన్స్ శాఖ , మైనింగ్ శాఖల నుంచి రెండు సెక్షన్లను తరలించనున్నారు. అలాగే హోంశాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి నాలుగు సెక్షన్లు తరలించే ఆలోచనలో ఉంది. అలాగే విద్య, వైద్య ఆరోగ్య శాఖ నుంచి 2సెక్షన్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 శాఖల నుంచి పలు విభాగాలను తరలించే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది. అయితే ఈ సారి విశాఖలోనే రిపబ్లిక్ డే పరేట్ నిర్వహించున్నట్లు ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.


Full View

  

Tags:    

Similar News