మండలిని రద్దు చేయాలంటే రెండేళ్లు పడుతుంది : ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం

Update: 2020-01-25 05:53 GMT

రాజదాని వికేంద్రీకరణ మరియు సిఆర్‌డిఎ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే నిర్ణయం ఇప్పటికే కౌన్సిల్ చైర్మన్ ప్రకటించినట్లు ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం తెలిపారు. అయితే సెలెక్ట్ కమిటీని ప్రకటించిన తరువాత ప్రాసెస్ మొదలవుతుందని ఆయన అన్నారు. శుక్రవారం ఒంగోలులో మాట్లాడుతూ.. తూర్పు రాయలసీమకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి మరియు ఇతర నాయకులు శాసనసభ ఎగువ సభను కించపరచడం మానేయాలని హితవు పలికారు. కౌన్సిల్ లో గ్రాడ్యుయేట్లు మరియు ఉపాధ్యాయుల సభ్యులు అనేక విషయాలపై చర్చించినట్లు చెప్పారు.

అసెంబ్లీ కంటే ప్రజలకు మరింత అర్ధవంతంగా కౌన్సిల్‌ లో చర్చించామని ఆయన తెలిపారు. కౌన్సిల్ ను అప్రజాస్వామికంగా రద్దు చేయాలనుకున్నా.. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి దాదాపు రెండేళ్లు పడుతుందని ఆయన అన్నారు. అంతకుముందు 1983 మార్చిలో కౌన్సిల్ ను రద్దు చేయాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది, కాని తీర్మానం న్యాయ శాఖకు, తరువాత పార్లమెంటు ఉభయ సభలకు వెళ్లి ఆ తరువాత రాష్ట్రపతికి వెళ్ళిన తరువాత మాత్రమే 1985 ఏప్రిల్‌లో కౌన్సిల్ రద్దు చేయబడిందని గుర్తుచేశారు. కాగా 13 సంవత్సరాల క్రితం పున స్థాపించినప్పటి నుండి కౌన్సిల్ లో సభ్యుడిగా సుబ్రమణ్యం ఉన్నారు.

మండలిని రద్దు చేయాలంటే రెండేళ్లు పడుతుంది : ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యంఇదిలావుంటే రాజదాని వికేంద్రీకరణ మరియు సిఆర్‌డిఎ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే సెలక్ట్ కమిటీకి పంపించే ప్రాసెస్ మధ్యలో నిలిచిపోయిందని షరీఫ్ మరోసారి బాంబ్ పేల్చారు. దీంతో టీడీపీ పునరాలోచనలో పడినట్టు తలుస్తోంది. మరోవైపు కౌన్సిల్ ను రద్దు చేసే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. సోమవారం ఉదయం కేబినెట్ సమావేశం నిర్వహించి కౌన్సిల్ పై తీర్మానం చేయనున్నారు. ఆ వెంటనే అసెంబ్లీని సమావేశపరచి కౌన్సిల్ రద్దుపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం కేబినెట్ మీటింగ్ కు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం నోట్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఈ తతంగం పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

Tags:    

Similar News