పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం లేదా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించలేదనుకొనిందట!, ఇలాంటి సామెతలు పిల్లి మీద మనం వాడుతాము. అలాగే పిల్లి శకునాన్ని చాలామంది నమ్ముతుంటారు. ఈ విశ్వాసాల ప్రకారం పిల్లి కనుక మనం వెళ్లే దారికి అడ్డంగా వస్తే, ఆ రోజు చేపట్టే పనులు పూర్తికాకుండా ఆగిపోతాయి అని కొద్దిమంది నమ్మకం. అలా పిల్లి కి సంబంధించి ఎన్నో నమ్మకాలూ వున్నాయి. అయితే పిల్లికి మరో పేరు మార్జాలం. దీనిని పెంపుడు పిల్లి అని కూడా అంటారు. మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో తమ పెంపుడు జంతువుగా పిల్లినే పెంచుకుంటారు. ఈ పిల్లులని మానవులు పురాతన కాలం నుండి సుమారు 9,500 సంవత్సరాలుగా పెంచుకుంటున్నారు. ఈ రోజు ప్రపంచ పిల్లుల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 8న అమెరికా లోని "ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్" అనే జీవకారుణ్య స్వచ్ఛంద సంస్థ 2002 నుండి ఈ ప్రపంచ పిల్లుల దినోత్సవం నిర్వహిస్తుంది. మీ ఇంట్లో పెంపుడు పిల్లి వుంటే దానికి శుభకాంక్షలు తెలుపండి ఈ రోజు.