సినిమా నటులైన ఉదయ్ కిరణ్... రంగనాథు పేర్లు వినగానే... గుర్తుకు వచ్చేది... వారు చనిపోయిన విధానం. ఆత్మహత్య మహా పాపం... ఆత్మహత్య అంటే మనం ఆపగలిగిన మరణం అని మీరు వినే వుంటారు. ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ఇది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (IASP) రూపొందించిన అధికారిక ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న జరుపుకునే ఒక అవగాహన రోజు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వివిధ కార్యకలాపాల రోజు. ఆత్మహత్యల నివారణ కోసం అంతర్జాతీయ అసోసియేషన్ (IASP), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తో మానసిక ఆరోగ్యం కోసం ప్రపంచ సమాఖ్య తో ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినమునకు ఆతిథ్యం ఇచ్చేందుకు కుదుర్చుకున్నది. అలాగే మనవంతుగా మనం ఏమి చెయ్యగలం అని అర్ధం చేసుకోవాల్సిన రోజు ఇది. ముఖ్యంగా ఆత్మహత్య అంటే మనం ఆపగలిగిన మరణం కాబట్టి అదెలాగో తెలుసుకోవాల్సిన బాద్యత మనందరి మీద వుంది.