తను నమ్మిన సిద్దాతం కోసం సింహంలా గర్జించిన మన 'టంగుటూరి ప్రకాశం' పంతులు పుట్టినరోజు ఈ రోజు. ప్రకాశం పంతులు గారు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కూడా. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.