స్వర్గానికి చెందిన దేవి.. భూలోకం వచ్చిన రోజు ఈ రోజు.

ఈ రోజు మన శ్రీదేవి పుట్టినరోజు. మన శ్రీదేవి. అందము,అభినయం,నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది.

Update: 2019-08-13 05:13 GMT

శ్రీదేవి...ఆ పేరు వినగానే సినీ లోకం యొక్క...అందాల నటి అంటారు కొందరు.... శ్రీదేవి...ఆ పేరు వినగానే అతిలోక సుందరి అంటారు కొందరు, శ్రీదేవి...ఆ పేరు వినగానే అమాయకత్వం తో కూడిన చలాకితనం అంటారు మరి కొందరు. ఇలా ఒక్కొక్కరు తమదైన అభిప్రాయాన్ని శ్రీదేవి విషయంలో కలిగి వుంటారు. ఎవరు ఎలాంటి అభిప్రాయం తో వున్నా, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హింది భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించి, తనదంటూ ఒక ముద్రని సృష్టించుకున్న తార...సితార. ఈ రోజు మన శ్రీదేవి పుట్టినరోజు. మన శ్రీదేవి. అందము,అభినయం,నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది.

పదహారేళ్ళ వయస్సు యొక్క అందం...నుండి...రాణికాసుల రంగమ్మ వరకు ప్రయాణం చేస్తూ..మనని క్షణక్షణం తన నటనతో ఆనందపరచింది. ఈమె తమిళనాడు లోని శివకాశి లో జన్మించింది. శ్రీదేవి అసలు పేరు....శీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. తన పుట్టిన రోజును శ్రీదేవి ఏటా ఆగస్టు 13న తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో జరుపుకొనేవారట. ఈ రోజు....శ్రీదేవి యొక్క ఎంతో మంది అభిమానులకు ప్రత్యేకమైన రోజు. ముఖ్యంగా ఆర్జీవి లాంటి ఎంతో మంది అభిమానులకి. ఇప్పుడు ఆ స్వర్గలోక వాసులను తన అందచందాలతో అలరిస్తూ అతిలోక సుందరి భిరుదును అక్కడ కూడా పొంది వుంటుంది అని ఆశిద్దాం. 

Tags:    

Similar News