అమెరికన్ గాయనిగా, గేయ రచయితగా, నటి గానే కాకుండా, పాప్ సంగీత రాణిగా కూడా పేరుతెచ్చుకున్న వక్తి మడోనా. నేడు మడోన్నా పుట్టిన రోజు. ఆమె పాటల రచన యొక్క సరిహద్దులను చెరిపివేసి జనాదరణ పొందిన సంగీతంలో ఎన్నో రికార్డు లు సృష్టించింది. అలాగే స్టేజి పై మరియు మ్యూజిక్ వీడియోలతో ప్రపంచ ప్రసిద్ది చెందింది. రికార్డింగ్ పరిశ్రమలో తన పత్యేకత కొనసాగిస్తూ, ఆమె తరచూ తన సంగీతం మరియు ఇమేజ్‌ను తిరిగి ఆవిష్కరించుకునేది. కొన్ని సార్లు ఆమె విషయాలు వివాదానికి దారితీసినప్పటికీ, ఆమె రచనలను, సంగీతము విమర్శకుల ప్రశంసలు పొందింది. 1991 నాటికి, ఆమె యునైటెడ్ స్టేట్స్లో టాప్ 10 హిట్లను ఇరవధి ఒక్కటికి పైగా సాధించింది మరియు అంతర్జాతీయంగా 70 మిలియన్లకు పైగా ఆల్బమ్లను విక్రయించింది. జనవరి 2008 లో, ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళా సంగీతకారురాలుగా పేర్కొంది.