పద్మశ్రీ సుధా మూర్తి పుట్టినరోజు!
పద్మశ్రీ సుధా మూర్తి పుట్టినరోజు ఈ రోజు. ఇన్ఫోసిస్ నారయణ మూర్తి సతీమణి సుధా మూర్తి సంఘ సేవకురాలు మరియు రచయిత్రి.
పద్మశ్రీ సుధా మూర్తి పుట్టినరోజు ఈ రోజు. ఇన్ఫోసిస్ నారయణ మూర్తి సతీమణి సుధా మూర్తి సంఘ సేవకురాలు మరియు రచయిత్రి. ముఖ్యంగా కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ మరియు గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుధా మూర్తి పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరించింది. కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడ్డారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంధాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. తన వృత్తి జీవితంతో బాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు మరియు కాల్పనిక రచనలు కూడా చేశారు. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే, ఆంగ్లములో డాలర్ బహు గా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది. సంఘ సేవని వీరు బాగా ఇష్టపడతారు.