తన మ్యూజిక్ తో నేటి యువతని ఉర్రూతలూగిస్తున్న...మన దేవీశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు ఈ రోజు. మన దేవి దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. దేవి చేసిన పాటలు బాలీవుడ్ ని కూడా ఉపెస్తున్నాయి. అయితే టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా మారాడు. దేవి కుటుంబానిది శాస్త్రీయ సంగీతం తో ముడిపడి వున్నా కుటుంభం. దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ఆ కలని నెరవేర్చుకొని ఈ రోజు మనందరిని మైమరిపిస్తున్నాడు. ఇలా ఇంకా ఎన్నో మంచి పాటలు మనకి దేవి అందించాలని ఆశిద్దాం.