పేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
Uppala Charitable Trust: తలకొండపల్లి జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార‌్థులకు క్రీడా దుస్తులు పంపిణీ
Uppala Charitable Trust: పోటీ ప్రపంచంలో చదువుతోనే సమాజంలో రాణించగలమని ఉప్పల చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేశ్ అన్నారు. చదువుకోవాలనే తపన ఉన్న పేద విద్యార్థులను ఉప్పల చారిటబుల్ ట్రస్టు ప్రోత్సహించి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవం సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్టు తలకొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 5 వేల మంది విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేస్తామన్నారు.
విద్యార్థులు క్రీడారంగంలో మంచిగా రాణించి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు తెచ్చుకోవాలని కోరారు. వెల్దండ, ఆమన్గల్‌లో ఈనెల 21 లోపు 5000 మందికి దుస్తులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, హై స్కూల్ చైర్మన్, సర్పంచ్ లలిత జ్యోతి, తుమ్మలకుంట సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, సింగల్ విండో డైరెక్టర్లు దేవుల నాయక్, కటికల శేఖర్ యాదవ్, భోజ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.