Corona: కరోనా వైరస్ లో మరో రెండు రకాలు... ఒక రకం తెలంగాణలో

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌లో మరో రెండు రకాలను గుర్తించామని కేంద్రం తెలిపింది.

Update: 2021-02-24 06:04 GMT

ఫైల్ Image

తెలంగాణ: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌లో మరో రెండు రకాలను గుర్తించారు. కరోనా కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు సంబంధించి ఎన్‌440కె, ఈ484కె రకాలను దేశంలోని మహారాష్ట్ర, కేరళల్లో గుర్తించినట్లు కేంద్రం మంగళవారం తెలిపింది. ఈ రెండు రకాల్లో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని వెల్లడించింది. మహారాష్ట్ర,Corona Virus ఇప్పటివరకు అది 3,500 వైరస్‌ల జన్యుపరిణామక్రమాలను విశ్లేషించింది. అందులో 187 మందిలో బ్రిటన్‌, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక వ్యక్తికి బ్రెజిల్‌ రకం వైరస్‌ సోకినట్లు తేలింది. జన్యుపరిణామక్రమాన్ని గుర్తించేటప్పుడు కేవలం ఈ మూడు రకాల వైరస్‌ల పరిశీలనకే పరిమితం అవకుండా, ఇంకా ఏమైనా ఉత్పరివర్తనాలు వచ్చాయేమోనని నిరంతరం పరిశీలిస్తున్నాం. మార్పులు రావడం వైరస్‌ సహజ లక్షణం. అందుకు అనుగుణంగానే మరికొన్ని రకాల మార్పులు కనిపించాయి. అయితే వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం ప్రకారం వైరస్‌లో వచ్చిన మార్పుల వల్లే కేసులు పెరగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు'' అని స్పష్టంచేశారు.

దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు వైరస్‌లో వచ్చిన మార్పులను కారణంగా చెప్పలేమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవకూడా చెప్పారు. మాస్క్‌ ధరించడం కొనసాగించాలని ప్రజలకు సూచించారు. సామూహిక సమావేశాలను పరిహరించాలన్నారు. 50 ఏళ్ల పైబడిన వయోవృద్ధులకు టీకాలు వేసే కార్యక్రమం అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు.

కేరళ నుంచి కర్ణాటకలోకి ప్రవేశించేవారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన అంశంలో కేంద్రం తక్షణం కల్పించుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మోదీకి ఓ లేఖ రాశారు. కొత్త ఆంక్షల కారణంగా కర్ణాటక వెళ్లే ప్రజలు, విద్యార్థులు, రోగులు, నిత్యావసరాలు తీసుకెళ్లే ట్రక్కుల డ్రైవర్లు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించడం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి కె.సుధాకరన్‌ ట్విటర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ''కర్ణాటక-కేరళ మధ్య రాకపోకలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిషేధించలేదు. కేరళ నుంచి కర్ణాటక వచ్చేవారు గత 72 గంటల్లో చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉండడాన్ని తప్పనిసరి చేశాం'' అని స్పష్టంచేశారు. ఈ నిబంధన ప్రయాణికులకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News