Cricketers Startup: గవాస్కర్ నుంచి గౌతీ వరకు.. స్టార్టప్స్ లో మన క్రికెటర్ల వాటాలు ఎంతంటే.. హైదరాబాద్ కంపెనీలో సచిన్ వాటా..

*మన క్రికెటర్లు మైదానంలోనే కాదు మైదానం బయట కూడా కోట్లు కొల్లగొడుతున్నారు. క్రికెట్ లో వచ్చే ఆదాయాన్ని తెలివిగా స్టార్టప్స్ లో పెడుతూ...బిజినెస్ రంగంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. వెటరన్ క్రికెటర్ గవాస్కర్ దగ్గర నుంచి విరాట్ కోహ్లీ వరకు ఎందరో క్రికెటర్లు స్టార్టప్స్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్..హైదరాబాద్ లోని ఆజాద్ ఇంజనీరింగ్ లో వాటా తీసుకున్నాడు.

Update: 2023-05-17 09:09 GMT

Cricketers Startup: గవాస్కర్ నుంచి గౌతీ వరకు..స్టార్టప్స్ లో మన క్రికెటర్ల వాటాలు ఎంతంటే..హైదరాబాద్ కంపెనీలో సచిన్ వాటా..

Cricketers Startup: మన ఇండియన్ క్రికెటర్స్ కేవలం మైదానంలోనే కాదు వ్యాపార రంగంలో కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. కపిల్ దేవ్ వంటి మాజీ దిగ్గజాల నుంచి విరాట్ కోహ్లీ వరకు వివిధ వెంచర్లలో పెట్టుబడులు పెట్టి విజయాలు సాధించారు. విరాట్ కోహ్లీ తన పెట్టుబడులతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుడి జాబితాలో చేరాడు.

స్టార్టప్స్ లో భారీగా క్రికెటర్ల పెట్టుబడులు:

భారత జట్టులోని ప్రస్తుత ఆటగాళ్ల నుంచి మాజీ ఆటగాళ్ల వరకు చాలా మంది వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టి విజయాలు సాధించారు. ప్రస్తుతం స్టార్టప్స్ లో పై మన క్రికెటర్లు విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు.

విరాట్ కోహ్లీ:

కింగ్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. ONE8, WROGN, ఫిన్ టెక్, స్పోర్ట్స్ కాన్వో, డిజిట్ ఇన్సురెన్స్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్, చిసెల్ జిమ్స్, D2C బ్రాండ్ రేజ్ కాఫీ ఇలా పలు రకాల స్టార్టర్స్ లో ఇన్వెస్ట్ చేశాడు.

ఎంఎస్. ధోనీ:

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ సైతం పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. కార్స్ 24, ఖాతాబుక్, రన్ ఆడమ్ స్పోర్ట్స్, గోల్డెన్ గూస్ స్పోర్ట్స్, 7 ఇన్క్ బ్రూస్, స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ఇలా పలు ఎంటర్ ప్రెన్యూర్స్ లో ఎంఎస్. ధోనీ వాటాదారుడు.

యువరాజ్ సింగ్:

బ్రాండ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరించడమే కాకుండా వాటిలో యువరాజ్ సింగ్ పెట్టుబడులు కూడా పెట్టాడు. వెల్ వర్డ్స్ అనే న్యూట్రీషన్ బ్రాండ్ కి ప్రచారంతో పాటు అందులో ఇన్వెస్ట్ కూడా చేశాడు. YouWeCanVentures అనే స్టార్టప్ లో యువీ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు.

శిఖర్ ధావన్:

యోగా బేస్డ్ హెల్త్ అండ్ వెల్ నెస్ స్టార్టప్ సర్వలో శిఖర్ ధావన్ పెట్టుబడి ఉంది. సర్వకు దేశవ్యాప్తంగా 91 యోగా స్టూడియోస్ ఉన్నాయి.

కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, జవగల్ శ్రీనాథ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనీల్ కుంబ్లే వంటి వెటరన్ ఆటగాళ్లు సైతం ఎంటర్ ప్రెన్యూర్స్ పై ఆకర్షితులయ్యారు. వీరు బడ్డింగ్ కంపెనీలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్, అజింక్య రహానే, రాబిన్ ఉతప్ప, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, హర్ష బోగ్లే వంటి క్రికెట్ కామెంటర్ కూడా స్టార్టర్స్ ను స్మార్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ గా భావిస్తున్నారు.

సచిన్ టెండూల్కర్:

సచిన్ టెండూల్కర్ స్మాష్ అనే స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాడు. హైదరాబాద్ కు చెందిన స్మార్ట్ రోన్ ఇండియా అనే స్టార్టప్ లోనూ వాటా ఉంది. ఇక తాజాగా హైదరాబాద్ కే చెందిన ఇంజనీరింగ్ మరియు టెక్ సొల్యూషన్స్ సంస్థ AZADలో సచిన్ పెట్టుబడులు పెట్టారు. ఈ మేరకు ఆజాద్ ఇంజినీరింగ్ ప్రకటన చేసింది. అయితే ఎంత వాటా అనేది మాత్రం గోప్యంగా ఉంచింది. మేక్ ఇన్ ఇండియా చొరవకు సహకారం అందించడంపై ఈ కంపెనీ దృష్టి పెట్టింది. క్లీన్ ఎనర్జీ, రక్షణ మరియు ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీకి AZAD మద్దతు ఇస్తుంది. ఈ సంస్థ త్వరలో పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలనే ఆలోచనలో ఉందట.

Tags:    

Similar News