Sangareddy JNTU: చట్నీలో ఎలుక.. విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర

Sangareddy JNTU: విద్యార్థులు తినే చట్నీలో ఎలుక దర్శనమివ్వడం సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.

Update: 2024-07-09 12:42 GMT

Sangareddy JNTU: చట్నీలో ఎలుక.. విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర

Sangareddy JNTU: విద్యార్థులు తినే చట్నీలో ఎలుక దర్శనమివ్వడం సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ చట్నీ పాత్రలో ఎలుక కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర అధికారులను ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలివచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ హస్టల్లో విద్యార్థులు తినే చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకోగా ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. గతకొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చాలంటూ విద్యార్థులు అందోళనకు దిగారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్, ఫుడ్ కాంట్రాక్టర్ను నిలదీసిన ప్రయోజనం లేకుండా పోయింది. విద్యార్థుల అందోళన నేపథ్యంలో ఇటీవల ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ హస్టల్ ను తనిఖీ చేసి, అక్కడున్న భోజన నమునాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు.

నిన్న రాత్రి విద్యార్థులు తినే ఆహారానికి సంబంధించిన చట్నీలో ప్రాణాలతో ఉన్న ఎలుక ప్రత్యక్షమై..అందులో తిరుగుతూ విద్యార్థులకు కనిపించింది. విషయాన్ని గమనించిన విద్యార్థులు ఫోన్లలో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్ గా మారింది. చట్నీలో ఎలుకపడిందన్న సమాచారం తెలుసుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం జేఎన్టీయూ కాలేజీకి తరలివచ్చింది. జిల్లా అదనపు కలెక్టర్ మాధూరి కళాశాలలోని హస్టల్ ను సందర్శించారు. హస్టల్లోని పాత్రను, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే తొలగించాలని ఆమె ప్రిన్సిపల్ ను ఆదేశించారు.

Tags:    

Similar News