మహిళలకు ఉచిత రవాణా అంటూ ప్రచారం.. స్పందించిన హైదరాబాద్ పోలీసులు

అయితే సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనా అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేని పరిస్థితి.

Update: 2024-08-22 11:03 GMT

మహిళలకు ఉచిత రవాణా అంటూ ప్రచారం.. స్పందించిన హైదరాబాద్ పోలీసులు

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చి తర్వాత సమాచార విప్లవం వచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వార్త వైరల్‌ అవుతోంది. సమాచార మార్పిడి అనేది చాలా సింపుల్‌ అయిపోయింది. ఏదైనా మేజర్‌ సంఘటన జరిగితే న్యూస్‌ ఛానల్స్‌ చూసే వారితో పాటు, సోషల్ మీడియాలో కూడా చెక్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

అయితే సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనా అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఏ న్యూస్‌ వైరల్‌ అవుతుందో తెలియదు. నిత్యం సోషల్‌ మీడియా వేదికగా ఏదో ఒక న్యూస్‌ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వార్తపై హైదరాబాద్‌ పోలీసులు స్పందించారు. కోల్‌కతాలో జరిగిన జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం, హత్య అనంతరం సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అయ్యింది. చాలా మంది ఈ వార్తను వాట్సాప్‌లో స్టేటస్‌గా కూడా పెట్టారు.

రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమం కల్పిస్తున్నారంటూ వస్తున్న వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఆ మెసేజ్‌తో తప్పుదోవ పట్టిస్తుందని తేల్చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్‌ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

1091, 78370 18555 నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తుందనేది అందులోని సారాంశం. చాలా మంది ఈ మెసేజ్‌ను వాట్సాప్‌ స్టేటస్‌గా కూడా పెడుతున్నారు. దీంతో ఈ వార్తలపై హైదరాబాద్‌ పోలీసులు వివరణ ఇచ్చారు. రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరిట జరుగుతున్నది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు.


Tags:    

Similar News