స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై బాలలత స్ట్రాంగ్ కౌంటర్

Smita Sabharwal: దివ్యాంగ సమాజాన్ని అవమాన పరిచేలా స్మితా సభర్వాల్ వ్యాఖ్యలున్నాయని బాలలత చెప్పారు.

Update: 2024-07-22 09:49 GMT

Bala Latha: స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై బాలలత స్ట్రాంగ్ కౌంటర్ 

Bala Latha: ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు తప్పుబడుతున్నారు. దివ్యాంగ సమాజాన్ని అవమాన పరిచే విధంగా ఉన్నాయని ప్రముఖ మోటివేటర్, సీ.ఎస్.బీ. ఐఏఎస్ అకడామీ నిర్వాహకురాలు బాలలత ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సివిల్స్ లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ చేసిన వ్యాఖ్యలు వివక్షకు గురవుతున్న వికలాంగులను మరింత కుంగదీశాయాన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వికలాంగురాలికే మొదట అపాయింట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. స్మిత సబర్వాల్ మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా.. లేక ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారా అన్నది తేల్చాలని అన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా ప్రవర్తించారన్నారు. స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం, సీఎస్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News