Weather Update: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు

Weather Update: పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ

Update: 2024-07-22 15:41 GMT

Rains: 48 గంటల పాటు భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు

Weather Update: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్‌, పరిసర ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. మరోవైపు తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటివేళ ముసురు వాన కురుస్తుండగా.. రాత్రిళ్లు వాన దంచికొడుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లాలు తడిసిముద్దయ్యాయి.

Tags:    

Similar News