Xiaomi Civi 5 Pro Launch Date: మార్కెట్‌ని షేక్ చేయనున్న షియోమి.. గ్లాస్ బాడీతో కొత్త ఫోన్ లాంచ్..!
Xiaomi Civi 5 Pro Launch Date: టెక్ దిగ్గజం షియోమి త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Civi 5 Proని చైనాలో లాంచ్ చేయనుంది.
Xiaomi Civi 5 Pro Launch Date: టెక్ దిగ్గజం షియోమి త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Civi 5 Proని చైనాలో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర, కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెసర్‌తో ఉంటుంది, దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Xiaomi Civi 5 Pro Price
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. Xiaomi Civi 5 Pro ధర దాదాపు 3,000 యువాన్లు (సుమారు రూ. 34,000) ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం గ్లాస్ బాడీతో మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌కు టాప్ లెఫ్ట్‌లో వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో పోర్ట్రెయిట్ టెలిఫోటో షూటర్ కూడా ఉంది.
Xiaomi Civi 5 Pro Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 8s Elite SoC, 5,000mAh బ్యాటరీ, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. దీనిలో గొప్ప ఫోటోగ్రఫీ కోసం లైకా ఆప్టిమైజేషన్ ఉంటుంది. డిజైన్ గురించి మాట్లాడితే Xiaomi Civi 5 Pro దాని పాత మోడల్ - Civi 4 Pro లాగా స్లిమ్, ఆకర్షణీయమైన రూపంతో వస్తుంది. ఫోన్ మల్టీ కలర్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు.
Xiaomi Civi 5 Pro Launch Date
షియోమి మార్చి 2024లో Civi 4 Proని ప్రారంభించింది. దాని అప్‌గ్రేడ్ వెర్షన్ Q1 2025 (జనవరి-మార్చి) నాటికి ప్రారంభించవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇంకా తన అధికారిక ప్రారంభ తేదీని ధృవీకరించలేదు.