Redmi A4 5G: కళ్లు చెదిరే ఫోన్.. రెడ్‌మి నుంచి బడ్జెట్ కిల్లర్.. ధర తెలిస్తే వదలరుగా..!
Redmi A4 5G: ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024 ఈవెంట్ భారతదేశంలో జరుగుతోంది.
Redmi A4 5G: ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024 ఈవెంట్ భారతదేశంలో జరుగుతోంది. దీనిలో చైనీస్ టెక్ కంపెనీ Xiaomi చిప్‌మేకర్ Qualcomm సహకారంతో కొత్త ఫోన్ పరిచయం చేసింది. కంపెనీ Redmi A4 5G పేరుతో ఈ ఫోన్‌ని తీసుకువచ్చింది. 5G కనెక్టివిటీ ఉన్నప్పటికీ ఇది రూ. 10,000 కంటే తక్కువ ధర సెగ్మెంట్‌లో మార్కెట్‌లోకి రానుంది.
Xiaomi కొత్త ఫోన్‌లో పెద్ద 6.7 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. మంచి పనితీరు కోసం Qualcomm స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది రెండు విభిన్న కలర్ ఆప్షన్లతో పరిచయం చేయబడింది. ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉంచనున్నట్టు స్పష్టమవుతోంది.
Redmi A4 5G Specifications
Xiaomi కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను అందించింది. Qualcomm భాగస్వామ్యంత ఇది స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. దాని వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది. డివైస్ మిగిలిన స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు. కానీ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంటుంది
స్మార్ట్‌ఫోన్ మిగిలిన స్పెసిఫికేషన్‌లు ధర లేదా వేరియంట్‌ల గురించి సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఇంకా దీని లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. ఇది బ్లాక్ , సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో పరిచయం చేయబడింది. ఈ ఫోన్ సంవత్సరం చివరి నాటికి అమ్మకానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
IMC 2024 భారతదేశంలో ఈ సంవత్సరంలో అతిపెద్ద టెక్ ఈవెంట్. ఇందులో టెక్ ప్రపంచానికి సంబంధించిన ఆవిష్కరణలు, అభివృద్ధి గురించి సమాచారం ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 5G, AI కి సంబంధించిన అనేక ప్రకటనలు విడుదలయ్యాయి. 6G భవిష్యత్తు గురించి కూడా చర్చిస్తున్నారు.