WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్‌.. మీ మెసేజ్‌లను చదివి పెడుతుంది

WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్‌.. మీ మెసేజ్‌లను చదివి పెడుతుంది

Update: 2024-07-15 17:00 GMT

WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్‌.. మీ మెసేజ్‌లను చదివి పెడుతుంది 

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఏంటా ఫీచర్‌.? దీని ఉపయోగం ఏంటో.? ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్‌ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో ఇకపై మీకు వచ్చే మెసేజ్‌లను చదివి పెడుతుంది. అది కూడా మీకు నచ్చిన భాషలో. ఉదాహరణకు మీకు ఇంగ్లిష్‌లో ఒక మెసేజ్‌ వచ్చిందని అనుకుందాం. మీరు ఆ మెసేజ్‌ను మీకు నచ్చిన భాషలో వినొచ్చు. ఈ కొత్త ఫీచర్‌ గూగుల్ లైవ్‌ ట్రాన్స్‌లేట్‌ టెక్నాలజీ సహాయంతో పని చేస్తుంది.

WABetaInfo ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని ఇచ్చింది. దీని ప్రకారం వాట్సాప్‌లో కొత్త లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఫీచర్‌ మొబైల్‌ డివైజ్‌ల్లోనే పనిచేయనుంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌ 2.24.15.9లో ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. టెస్టింగ్ పూర్తికాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో తెలియజేయడానికి ఓ స్క్రీన్ షాట్‌ను విడుదల చేశారు.

వాట్సాప్‌ విడుదల చేసిన స్క్రీన్‌ షాట్స్‌ ఆధారంగా ఈ కొత్త ఫీచర్‌లో రీడ్ యువర్ వాయిస్ మెసేజెస్ విత్ ట్రాన్స్క్రిప్ట్ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీకు వచ్చిన మెసేజ్‌ను మీకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేస్తుంది. అలాగే వాయిస్‌ మెసేజ్‌లను కూడా మీకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్‌ చేసి వినిపిస్తుంది. అయితే ఇది కేవలం వాయిస్‌ మెసేజ్‌లకేనా, టెక్ట్స్‌ మెసేజ్‌లకు కూడా వర్తిస్తుందా.? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.


Tags:    

Similar News