Water Purifier: వాటర్ ప్యూరిఫైయర్ ఆఫర్స్‌.. అతి తక్కువ ధర, తక్కువ ఈఎంఐ..!

Water Purifier: నేటి కాలంలో ప్రతి ఇంట్లో నీటి శుద్ధి యంత్రాలు కనిపిస్తున్నాయి.

Update: 2023-03-20 09:01 GMT

Water Purifier: వాటర్ ప్యూరిఫైయర్ ఆఫర్స్‌.. అతి తక్కువ ధర, తక్కువ ఈఎంఐ..!

Water Purifier: నేటి కాలంలో ప్రతి ఇంట్లో నీటి శుద్ధి యంత్రాలు కనిపిస్తున్నాయి. అనేక ఫిల్టర్లు, సాంకేతికత ప్యూరిఫైయర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో సులువుగా నీటిని శుభ్రం చేయవచ్చు. నీటిలోని మలినాలని, రసాయనాలను వేరు చేయడానికి RO, UV, UF, TDS వంటి టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఆఫర్‌లతో లభించే కొన్ని వాటర్ ప్యూరిఫైయర్‌ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

కెంట్ సుప్రీం లైట్ RO+UF వాటర్ ప్యూరిఫైయర్

కెంట్‌ సుప్రీం లైట్‌లోని నీరు RO+UF ప్రక్రియ ద్వారా శుద్ధి జరుగుతుంది. ఇది రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్‌లను వేరు చేయడం ద్వారా స్వచమైన నీటిని అందిస్తుంది. త్రాగే నీటిలో మినరల్స్ ఉంటాయి. మురికి నీరు మొత్తం బయటికి వెళ్లిపోతాయి. ఇది 8 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ.20,500 కానీ మీరు దీన్ని 27 శాతం తగ్గింపు తర్వాత అమెజాన్ నుంచి రూ.14,900కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా మీరు బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. కస్టమర్ల సౌలభ్యం కోసం నెలవారీ రూ.630 ఈఎంఐ వద్ద కొనుగోలు చేయవచ్చు.

Aquaguard Aura 7L RO+UV+టేస్ట్ అడ్జస్టర్

RO+UV+Taste Adjuster (MTDS) వంటి టెక్నాలజీ ఆక్వాగార్డ్‌లో ఉంటుంది. ఇందులో UV e-boiling ప్రతి నీటి చుక్కను వేడిచేస్తుంది. ఇందులో కాపర్ + జింక్ బూస్టర్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఇది నీటిలో అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. దీని అసలు ధర రూ.23,000 అయితే దీన్ని 30 శాతం తగ్గింపు తర్వాత అమెజాన్ నుంచి రూ.15,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా మీరు దానిపై నెలవారీ ఈఎంఐ రూ.1,858తో ఇంటికి తీసుకురావొచ్చు.

Tags:    

Similar News