Smartphone: ఈ వారంలో మార్కెట్లోకి వస్తోన్న కొత్త ఫోన్‌లివే.. ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి..!
Smartphone: మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
Smartphone: మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అప్‌డేట్ వెర్షన్‌తో వస్తోన్న ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూజర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఫీచర్లతో ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ప్రతీ నెల మార్కెట్లోకి కొంగొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఫోన్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ వారం మార్కెట్లోకి కొత్తగా మూడు ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్‌లు ఏంటి.? వాటిలో ఉన్న ఫీచర్లు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ఈ వారం లాంచింగ్‌కు సిద్ధమైన స్మార్ట్ ఫోన్స్‌లో పోకో కంపెనీకి చెందిన ఫోన్ ఒకటి. డిసెంబర్ 17వ తేదీన పోకో సీ75 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన ఓ టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇప్పటికీ తెలకపోయిన్పటికీ కొన్ని ఫీచర్లు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌ను ఇవ్వనున్నారు. అలాగే స్టోరేజ్‌ను ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 10 వేల లోపు ఉండొచ్చని అంచనా.
* ఇక ఈ వారం మార్కెట్లోకి వస్తున్న మరో కొత్త ఫోన్ రియల్‌మీ 14 ప్రో. ఈ ఫోన్‌ను డిసెంబర్ 18వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌ను 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో పాటు.. 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో రావచ్చని అంచనా వేస్తున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. బ్యాటర్ విషయానికొస్తే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 15 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
* ఈ వారం వస్తున్న మరో కొత్త ఫోన్ రియల్ మీ 14 ఎక్స్. ఈ స్మార్ట్ ఫోన్‌ను డిసెంబర్ 18వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ డైమండ్ కట్ డిజైన్‌తో కూడిన గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు దీర్ఘచతురస్రాకార షేప్‌లో ఉండే కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. ఇక ఇందులో ఐపీ69 రేటింగ్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 15 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది.