BSNL Big Update: ఎగిరిగంతేసే న్యూస్.. BSNL నెట్వర్క్‌పై సూపర్ అప్‌డేట్..!
BSNL Big Update: ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా BSNL గురించి పెద్ద సమాచారం అందించారు. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను 2025 నాటికి ప్రారంభిస్తామని చెప్పారు.
BSNL Big Update: స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ రెండింటిలో ఒక్కటి కూడా లేకుంటే మన పనులు చాలా వరకు ఆగిపోతాయి. ఫోన్‌కు సరైన నెట్‌వర్క్ లేకపోతే అది పెద్ద సమస్యలను కలిగిస్తుంది. నెట్‌వర్క్ కవరేజీ తగ్గినందున సరిగ్గా కమ్యూనికేట్ చేయలేము లేదా ఇంటర్నెట్‌ని ఉపయోగించలేము. ఈ రకమైన సమస్య కొన్నిసార్లు BSNL, Jio, Airtel, Vi, దాదాపు అన్ని రకాల వినియోగదారులకు సంభవిస్తుంది. కానీ ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ తీవ్రంగా శ్రమిస్తుంది.
ఈ క్రమంలోనే BSNL 4G కోసం కోట్లాది మంది మొబైల్ వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు మీ ఫోన్‌లో BSNL సిమ్‌ని కూడా ఉపయోగిస్తుంటే మీకు శుభవార్త ఉంది. BSNL 4G సేవ త్వరలో ప్రారంభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. రాబోయే కొద్ది నెలల్లో BSNL వినియోగదారులు 4G ఇంటర్నెట్ కనెక్టివిటీని ఎంజాయ్ చేయవచ్చు.
ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా BSNL గురించి పెద్ద సమాచారం అందించారు. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అతని ప్రకారం BSNL 4G కనెక్టివిటీ వచ్చే ఏడాది అందుబాటులో ఉంటుంది. వచ్చే ఏడాది మధ్యలోకి రావచ్చని కేంద్రమంత్రి తెలిపారు.
జ్యోతిరాదిత్య సింధియా కూడా 6G గురించి పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. 6జీ పేటెంట్లలో దేశానికి 10 శాతం వాటా లభిస్తుందని చెప్పారు. సాంకేతికతను తీసుకురావడమే మా లక్ష్యం కాదని, భారతీయ సాంకేతికతపై దృష్టి పెడుతున్నామని సింధియా చెప్పారు.
BSNL ప్రస్తుతం లోకల్ స్టాక్ ఆధారిత 4G నెట్‌వర్క్‌పై వేగంగా పని చేస్తోందని ఆయన చెప్పారు. 4జీ నెట్‌వర్క్ కోసం ఇప్పటి వరకు దాదాపు 22,500 మొబైల్ టవర్లను సంస్థ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తదుపరి దీని సంఖ్య లక్షకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
ప్రస్తుతం టెలికాం రంగంలో BSNL హాట్ టాపిక్‌గా మారింది. ప్రజలు నిరంతరం దీని గురించి చర్చించుకుంటున్నారు. Jio, Airtel, Vi తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటి నుండి,మొబైల్ వినియోగదారులు BSNLకి మారుతున్నారు. గత ఒకటి, రెండు నెలల్లో లక్షల మంది తమ సిమ్‌లను బిఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేశారు.