Mini Washing Machine: ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. ధర చాలా తక్కువ..!

Folding Washing Machine: మనం ఇంట్లో ఉన్నప్పుడు బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ ఉంటుంది. కానీ, ప్రయాణించేటప్పుడు వాషింగ్ మెషీన్‌ను వెంట తీసుకెళ్లడం కుదరదు. ఇలాంటి సమయంలో పోర్టబుల్ వాషింగ్ మెషీన్ ఒకటుందని తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు.

Update: 2023-06-05 03:47 GMT

కొన్ని రోజులు ఫ్యామిలీతో కలసి బయటకు వెళకతేపకపాజజ లేదా మీరు విద్యార్థి లేదా బ్యాచిలర్, ఒంటరిగా జీవిస్తున్నట్లయితే.. అందరూ ఇబ్బంది పడే విషయాల్లో ఒకటి బట్టలు ఉతకడం కోసమే. చాలామంది ఈ సమస్యల నుంచి బయటపడేందుకు వాషింగ్ మెషీన్లు లేదా బట్టలు ఉతికే వాళ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇవి కొంచెం ఖరీదుతో కూడుకున్నవి. అయితే, ఈ ఫోల్డబుల్ వాషింగ్ మెషీన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఇది పోర్టబుల్ అలాగే కాంపాక్ట్ సైజులో ఉంటుంది. ఇది ఎక్కువ స్థలాన్ని కూడా తీసుకోదు.

దీనిపేరే ఆక్ట్రా మినీ ఫోల్డింగ్ వాషింగ్ మెషీన్. ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ నుంచి కేవలం రూ. 2,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ప్రయాణం లేదా వ్యాపార పర్యటన కోసం ఇది చాలా మంచి ఎంపిక.

అమెజాన్ ప్రకారం, ఈ కాంపాక్ట్, పోర్టబుల్ వాషింగ్ మెషీన్ ఎత్తు 15-అంగుళాలు. ఇది 7-అంగుళాల వరకు మడుచుకోవచ్చు. ఇది టాప్ లోడింగ్‌తో వస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ బాడీ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. దీని సామర్థ్యం 2 కిలోలు.

ఇందులో బట్టలు వేసిన తర్వాత మాన్యువల్‌గా వాషింగ్ పౌడర్, నీటిని జోడించాలి. తర్వాత అవసరాన్ని బట్టి టైమ్ సెట్ చేసుకుని వదిలేయాలి. అప్పుడు ఈ మెషీన్ బట్టలు శుభ్రం చేస్తుంది.

సాక్స్, టీ-షర్టులు, టవల్స్, లోదుస్తులు, పిల్లల బట్టలు ఉతకడానికి ఈ మెషీన్ ఉత్తమమని యూజర్లు పేర్కొంటున్నారు. దీనిలో పండ్లు, నగలు, బొమ్మలు వంటి వాటిని కూడా కడిగే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News