TCL Android 11 TV: వీడియో కాల్ కెమెరాతో టీసీఎల్ టీవీలు
TCL Android 11 TV: టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ వీడియో కాల్ కెమెరాతో నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను ఇండియాలో విడుదల చేసింది.
TCL Android 11 TV: వినియోగదారులను ఆకట్టుకోవడానికి చాలా సంస్థలు తమ నూతన ఉత్పత్తుల్లో ఏదో ఒక ప్రత్యేకతను జోడించడం మామూలే. మనం సాధారణంగా స్మార్ట్ ఫోన్లలోనే వీడియో కాల్ చేసేందుకు ప్రత్యేక కెమెరాలు చూశాం. ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. తాజాగా టీవీల్లోనూ ప్రత్యేక కెమెరాలు రాబోతున్నాయి. టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తన మొదటి 2021 ఆండ్రాయిడ్ టీవీ ని విడుదల చేసింది. దీనిలో ప్రత్యేకం ఏంటని అనుకుంటున్నారా.. అదేనండీ.. వీడియో కాల్ చేసుకునేందుకు స్పెషల్ గా కెమెరాతో ఈ టీవీలను తయారుచేశారు.
టీసీఎల్ ఆండ్రాయిడ్ 11 మోడల్ పీ725 లో 4 టీవీలను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటిలో 43, 50, 55, 60 అంగుళాలతో ఉన్నాయి. వీటి ధరలు రూ. 41,990 నుంచి రూ. 89,900 లుగా ఉన్నాయి. ఇవి త్వరలో అమెజాన్ లో సేల్ కు రానున్నాయి.
టీవీ పై భాగంలో వీడియో కాల్ కోసం ప్రత్యేకంగా కెమెరాను అందించారు. గూగుల్ డుయో యాప్ తో స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియో చాట్ చేసేందుకు, అలాగే ఆన్‌లైన్ క్లాస్ లు వినేందుకు వాడుకోవచ్చని టీసీఎల్ కంపెనీ తెలిపింది.
టీసీఎల్ పీ 725 టీవీలు స్టాక్ ఆండ్రాయిడ్ తో కంపెనీ ప్రత్యేకంగా తయారుచేసిని ఇంటర్‌ఫేస్ ఛానల్ 3.0 తో నడవనున్నాయి. వీటిలో దాదాపు గా 7000 యాప్స్, గేమ్స్ ను గూగుల్ ప్లే తో యాక్సిక్ చేయవచ్చు. అలాగే పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్.. నెట్‌ప్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి వాటిని ఇన్ బిల్ట్‌గా అందిస్తున్నారు.